రేవంత్‌ సర్కార్‌ ఎప్పుడు కూలుతుందో తెలీదు – హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో హరీష్‌ రావు మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటదో తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల కంటే ఎక్కువ ఏ రాష్ట్రాల్లో లేదని బాంబ్‌ పేల్చారు.

Harish Rao

కొన్ని చోట్ల సెల్ఫ్ గోల్ తో మధ్యలోనే ప్రభుత్వం గాయబ్ అవుతుందని చురకలు అంటించారు హరీష్ రావు. ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లలో ఐదేళ్ల కంటే ఎక్కువ లేదు… మళ్ళీ తెలంగాణలో వచ్చేది మనమేనని తేల్చి చెప్పారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version