సినిమా రిలీజ్ అయిన మొదటి మూడు రోజులు రివ్యూలు రేటింగ్ లో ఇవ్వకూడదని కేరళలో కోర్టు తీర్పునిచ్చింది అలాంటి చట్టం వస్తే కానీ ఇండస్ట్రీ బాగుపడతని నిర్మాత దిల్ రాజు చెప్పారు. సినిమా మీద నెగటివ్ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదని అన్న పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో వచ్చింది ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 న ఇది రిలీజ్ అయింది సోషల్ మీడియాలో ఈ సినిమా పై దుష్ప్రచారం జరుగుతోంది.
ఈ నెగటివ్ ప్రచారం పై దిల్ రాజు స్పందించారు ప్రేక్షకుల స్పందన ఒకలా ఉంటే సోషల్ మీడియాలో ఇంకోలా ఉందని ట్రోల్ చేస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందని అంటున్నారు అందరూ సినిమాని ఆశీర్వదిస్తున్నారు. మేము ఓ మంచి సినిమా తీశాం. మీరు థియేటర్ కి వచ్చి చూసి నచ్చితే నలుగురికి చెప్పండి లేకపోతే మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను అని దిల్ రాజు అన్నారు ప్రస్తుతం దిల్ రాజు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.