రాష్ట్ర ఆర్థిక శ్వేత పత్రంలో ప్రజలు.. ప్రగతి కోణం లేదు: హరీశ్‌రావు

-

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు. ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్‌ పాలన కొనసాగించాలని సూచించారు.ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందన్న హరీశ్‌రావు గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనపడుతోందని వ్యాఖ్యానించారు.

“శ్వేత పత్రంలో ప్రజలు.. ప్రగతి కోణం లేదు. రాజకీయ ప్రత్యర్థులపై దాడి.. వాస్తవాల వక్రీకరణే ఉంది. శ్వేతపత్రాన్ని తెలంగాణ అధికారులు తయారు చేయలేదు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్‌ కమిటీ వేయండి.సస్పెండ్‌ అయిన ఆంధ్రా అధికారులతో తప్పుడు నివేదికలు తయారు చేయించారు. రాష్ట్ర ఆదాయాన్ని ఆంధ్రాలో ఖర్చు చేశారని అప్పట్లో అనేక కమిటీలు తెలిపాయి. తెలంగాణ నిధులు రాష్ట్రంలోనే ఖర్చు చేయాలన్నదే పెద్ద మనుషుల ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందం అమలు చేయకపోవడం వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ నిధులు విషయంలో అప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చాలా కమిటీలు వేశాయి. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా అధికారులతో నివేదిక తయారు చేయించారు. సీఎం పాత గురువు పాత శిష్యులు ఈ నివేదిక తయారు చేయించారు. కావాలంటే వారి పేర్లు చెబుతా. ఆధారాలు కూడా బయటపెడతా. తమకు అనుకూలమైన వాదనలతోనే నివేదిక తయారు చేయించారు.” అని హరీశ్ రావు మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news