రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల.. నివేదిక చదివే సమయం కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ ఫైర్

-

నాలుగు రోజుల తర్వాత తెలంగాణ శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఎంఐఎం, సీపీఐ శాసనసభా పక్ష నేతలను స్పీకర్ ప్రకటించారు. ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా అక్బరుద్దీన్‌, సీపీఐ శాసనసభా పక్ష నేతగా కూనంనేని సాంబశివరావులను సభాపతి ప్రసాద్ కుమార్ ప్రకటించిన అనంతరం ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క్ శాసనసభలో విడుదల చేశారు. ప్రజలందరూ అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని, గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదని ఆయన వ్యాఖ్యానించారు. దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలనే శ్వేత పత్రం విడుదల చేస్తున్నామని వెల్లడించారు.

దీనిపై బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే స్పందించారు. 42 పేజీల పుస్తకం ఇచ్చి ఇప్పుడు మాట్లాడాలి అంటే ఎలా? అని సభను ప్రశ్నించారు. నివేదికను చదివే సమయం కూడా తమకు ఇవ్వలేదని పేర్కొన్నారు.ముందు రోజే డాక్యుమెంట్‌ ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే సమాధానం సంతృప్తి కలిగించకపోతే నిరసన చేసే అవకాశం ఉందని వెల్లడించారు. సభను హుందాగా నడిపేందుకు బీఆర్ఎస్ పూర్తిగా సహకరిస్తుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news