కేసు కొట్టివేయాలని హైకోర్టులో హరీష్ రావు పిటిషన్..!

-

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తన మీద నమోదైన కేసు కొట్టివేయాలని హై కోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ వేసారు. అయితే తాజాగా సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 1న హరీష్ రావు పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. హరీష్ రావు తన ఫోన్ టాప్ చేయించారని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అలాగే హరీష్ రావు నుండి తనకు ప్రాణ హాని ఉంది అని కూడా తెలిపారు. హరీష్ రావు తో పాటు మాజీ డీసీపీ రాధాకృష్ణన్ రావు పై కూడా కేసు నమోదు చేసారు పంజాగుట్ట పోలీసులు. అయితే తన పై రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు హరీష్ రావు. నిరాధర ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో ఇరికించారని పిటిషన్ లో తెలిపిన హరీష్ రావు.. కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version