సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం.. హరీష్ రావు సీరియస్ రియాక్షన్..!

-

హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగటం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయి. నేరాల రేటు గణనీయంగా పెరిగింది అని తెలిపారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నా ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఒక్క నాడు సమీక్ష చేయడం లేదు అని పేర్కొన్నారు.

అదే విధంగా మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరం. అత్యాచార బాధితురాలికి భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news