సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన ఏర్పాట్లపై హరీష్ రావు సమీక్ష

-

తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. ఆగస్టు 19న మెదక్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి ముందు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించానున్నారు.

అయితే సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మెదక్ జిల్లా నుండి భారీగా జన సమీకరణ చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news