చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు.. హరీష్ రావు సంచలన పోస్ట్

-

తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ, గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నట్లు? అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎలాంటి అనుమతులు లేకుండా రూ. 80 వేల కోట్లతో నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం నిధులు, మిగతా 50 శాతం ఎఫ్ఆర్బీఎం పరిధి మించి రుణ సమీకరణకు ఏపీకి అనుమతించడం అన్యాయం, అనైతికం అని పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం, కృష్ణా లేదా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే రివర్ మేనజ్మెంట్ బోర్డుల అనుమతి అవసరం అని డిమాండ్ చేసారు.

KTR, Harish Rao to meet former leaders of employee unions
KTR, Harish Rao to meet former leaders of employee unions

కానీ అందుకు విరుద్ధంగా, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే అడ్డుకోవాల్సిన కేంద్రం, నిధులిచ్చి సహకరించడం దుర్మార్గం అని పేర్కొనాన్రు. ఇది తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తీవ్ర అన్యాయం
ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి ఏం లాభం అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకుంటే, ఎఫ్ఆర్బీఎం కింద రికవరీ పెట్టారు, కానీ బనకచర్ల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా 50శాతం ఎఫ్ఆర్బీఎం పరిమితి మించి రుణం తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news