మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే కొంతమంది తక్కువ మోతాదులో ప్రతిరోజు ఆల్కహాల్‌ను తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది అని చెబుతూ ఉంటారు. మద్యపానం, ధూమపానం, గుట్కా వంటివి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి మరియు వాటికి బానిసలుగా మారాల్సి వస్తుంది. కొంతమంది క్రమం తప్పకుండా ఆల్కహాల్ ను తీసుకుంటారు, దానివలన క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతారు. అయితే, మరి కొందరు అప్పుడప్పుడు ఆల్కహాల్‌ను తీసుకుంటూ ఉంటారు.
అటువంటివారు రోజుకి ఒకటి లేదా రెండు పెగ్గులను తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు అని చెబుతూ ఉంటారు. అయితే అసలు నిజం ఇదే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఆల్కహాల్‌ను కొంచెం మోతాదులో తీసుకున్నా లేక ఎక్కువ మోతాదులో తీసుకున్నా సరే ఆరోగ్యానికి హానికరం అని తెలియజేయడం జరిగింది. ఆల్కహాల్ ఆరోగ్యకరం కాదని, దీనికి అలవాటు పడితే ఎంతో ప్రమాదం అని చెబుతోంది. పురుషులు లేక మహిళలు అయినా సరే రోజుకు ఒక గ్లాసు లేదా అంతకంటే తక్కువే తాగాలి. యూకే గైడ్‌లైన్స్ ప్రకారం, ఆల్కహాల్‌ను వారానికి మూడు రోజులకు మించి అస్సలు తాగకూడదు.
వారంలో 8 లేదా 10 మిల్లీమీటర్లకు మించి తాగితే ఎంతో ప్రమాదం అని చెబుతోంది. తక్కువ మోతాదులో ఆల్కహాల్‌ను తీసుకున్నా సరే, గుండె బలహీనంగా మారుతుంది. ఈ విధంగా రక్తపోటు వంటి సమస్యలు ఎదురవుతాయి. పైగా ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్కహాల్‌కు బానిసలుగా మారడం వలన ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయి. కనుక, ఆల్కహాల్‌ను తీసుకోకపోవడమే మేలు అని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, డయాబెటిస్ తో బాధపడేవారు, కాలేయ వ్యాధులను ఎదుర్కొనేవారు 21 సంవత్సరాలు కంటే తక్కువ వయసు ఉన్న వారు కూడా ఆల్కహాల్‌ను అస్సలు తీసుకోకూడదు.