రాష్ట్ర శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. చర్చ ప్రారంభించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు రేవంత్ సర్కార్పై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి సహా మంత్రులు హరీశ్ రావుకు దీటుగా బదులిస్తున్నారు. అయితే శాసనసభలో చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి, హరీశ్ రావు మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం సాగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ పరువు తీసిందని, సోనియా ప్రతిష్టను దిగజార్చిందని హరీశ్ రావు మండిపడ్డారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత అని.. శ్వేతపత్రాలతో కపట నాటకాలు ఆడారని దుయ్యబట్టారు. గ్యారంటీలు, హామీలు అమలు చేయలేదని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.
మరోవైపు రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. సభ్యులు మాట్లాడే తప్పును సరిచేసే బాధ్యతను తనకు ఉందంటూ.. సభలో అబద్ధాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. 2018 డిసెంబర్‌లోపల విద్యుత్ మీటర్ల బిగిస్తామని కేసీఆర్.. కేంద్రానికి చెప్పారని.. అధికారిక లెక్కలు చూసి హరీశ్‌రావు స్పందించాలని సీఎం డిమాండ్ చేశారు.