బీసీలకు కేటాయించిన బడ్జెట్ గురించి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తరపున హరీశ్ రావు మాట్లాడారు. బెల్ట్ షాపులు ఎత్తేస్తే.. రూ.42 కోట్ల ఆదాయం ఎలా వచ్చిందని ప్రశ్నించారు హరీశ్ రావు. హైదరాబాద్ నగరంలో మహిళలకు భద్రత లేదన్నారు. 8 నెలల్లోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.
కాంగ్రెస్ సర్కారులో నేతన్నల ఆత్మహత్యలు పెరిగాయి. గతంలో రేవంత్ రెడ్డి గ్రూపు 2, 3 పోస్టులు పెంచాలన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్లే సరికి మాట మారింది. కేంద్ర బడ్జెట్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం ఎక్కువ.. ప్రజల కోనం తక్కువ అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. తెలంగాణ ప్రజలకు ఉపయోగకరంగా కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. బతుకమ్మ చీరల విషయం సీఎం వ్యాఖ్యలు సరికాదు.