బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సంధి కుదిరిందా : కిషన్ రెడ్డి

-

కాళేశ్వరం పై కాంగ్రెస్ ప్రభుత్వం  ఏం చేయబోతుంది అంటూ ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మంగళవారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కేసీఆర్ చేసిన అతిపెద్ద స్కామ్ అన్నారు. కాళేశ్వరం పై సీబీఐ దర్యాప్తు కూడా జరపాలన్నారు. కిషన్ రెడ్డి. దర్యాప్తు కోరిన 48 గంటల్లోనే విచారణ జరిగే విధంగా సిఫారసు చేస్తానన్నారు.

సీబీఐ దర్యాప్తు కోరకుంటే.. ఎలాంటి కార్యచరణ చేపట్టాలో చర్చిస్తాం అన్నారు. ఎంఐఎం మధ్య వర్తిత్వంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సంధి కుదిరిందా అని అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి కాదని నిరూపించుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.లక్ష కోట్ల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఘటనతో రాష్ట్ర ఇమేజ్‌ గోదాట్లో కలిసిందని వాపోయారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లపై కేంద్రానికి వెంటనే లేఖ రాశాం. ఉన్నతస్థాయి కమిటీ వచ్చి మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించింది. జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ మరికొన్ని వివరాలు కోరింది. భూ, పర్యావరణ పరీక్షలు సరిగా చేయలేదని జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version