హరీశ్ రావు నా ఇంటి ముందుకు వచ్చి చేతులు కట్టుకున్న విషయం మరిచిపోయారా..? : సీఎం రేవంత్ రెడ్డి

-

హరీశ్ రావు నా ఇంటి ముందుకు వచ్చి చేతులు కట్టుకున్న విషయం మరిచిపోయారా..? అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ సద్భావన యాత్ర కార్యక్రమంలో మాట్లాడారు సీఎం రేవంత్.. తనను నిక్కి నిక్కి చూశాడన్న హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లు దయతలిచి హవాయి చెప్పులున్న నిన్ను మంత్రిని చేస్తే.. ఇవాళ నీకు అజీజ్ నగర్ లో ఫాంహౌస్ వచ్చింది. ఏముండే నీకు అంతకు ముందు.. నాకు తెలియదా..? నేను తొంగి తొంగి చూసి ఉండవచ్చు. కానీ నీలాగా దొంగతనాలు చేయలేదు. నా ఇంటి ముందు చేతులు కట్టుకొని బిచ్చం ఎత్తుకున్న రోజులు మరిచిపోయావా..? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

హరీశ్ రావు నా ఇంటి ముందుకు వచ్చి చేతులు కట్టుకున్న విషయం మరిచిపోయారా..? చెప్పులు మోసే నేత నాకు సవాల్ చేస్తున్నాడు. నువ్వు కాదు.. సవాల్ చేసేది.. ఫామ్ హౌస్ లో పండుకున్న నేత వస్తే.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version