కరోనా ఉన్న డాక్టర్ తో రోగికి వైద్యం…!

-

బాచూపల్లి లోని ఎస్ ఎల్ జి ఆసుపత్రి లో దారుణం జరిగింది. ఒక కరోనా రోగి వైద్యుల పొరపాటు కారణంగా ప్రాణాలు విడిచారు. దీనితో అతని కూతురు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేసారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నే తన తండ్రి మరణించాడు అని కూతురు శ్వేత ఆరోపించారు. సుమారు 5 లక్షల వరకు బిల్లు వేసారు అని ఆమె మండిపడ్డారు.

55 వేల ఇంజక్షన్ ల తో పాటు రోజుకి 10 పీపీఈ కిట్లు అంటూ చెప్పారని అన్నారు. కానీ వెంటిలేటర్ పేషెంట్ వద్దకు వెళ్లిన సిబ్బంది అవి ఏమి ధరించలేదు అని ఆవేదన వ్యక్తం చేసారు. పాజిటివ్ ఉన్న డాక్టర్ తో ట్రీట్మెంట్ చేశారు అని అన్నారు. నడుచుకుంటూ వెళ్లిన తన తండ్రిని ఇంజెక్షన్ ల తో పడుకోపెట్టి ఇప్పుడు రెండు సార్లు గుండెపోటుతో మరణించినట్లు చెప్తున్నారు అని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version