క్యాన్సర్, గుండె చికిత్సలకు రూ.10 లక్షల వరకూ ఆరోగ్య బీమా

-

క్యాన్సర్, గుండె చికిత్సలకు రూ.10 లక్షల వరకూ ఆరోగ్య భీమా అందిస్తామని ప్రకటించారు మంత్రి హరీష్‌ రావు. రైతుభీమా తరహాలో.. కార్మిక భీమా తీసుకొస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. సిద్ధిపేటలో కార్మిక భవన్ కు ఎకరం స్థలం కేటాయింపు భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభలో మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ… నా శక్తినంతా ఉపయోగిస్తా… కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మీ భవన నిర్మాణ రంగ కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు.

రైతుభీమా తరహాలో.. కార్మిక భీమా తీసుకొస్తామని.. కార్మికుడి కార్డు రెన్యూవల్ పదేళ్లకు పెంచుతామని వెల్లడించారు. లక్షన్నర నుంచి రూ. 3 లక్షలకు భీమా పెంచుతామని ప్రకటన చేశారు. కార్మిక-ఆరోగ్య శాఖ ఒప్పందం ఉందని.. 5 లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఇటీవల కార్మిక-ఆరోగ్య శాఖ కార్మికుడి వైద్య సేవలపై చర్చించి ఒప్పందం కుదిరించుకున్నామని.. రూ.5 లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వర్తిస్తుందన్నారు. అలాగే క్యాన్సర్, గుండె చికిత్సలకు రూ.10 లక్షల వరకూ ఆరోగ్య భీమా వర్తించేలా ఈ ఆగస్టు నెల నుంచి అమలు కాబోతుందని ప్రకటించారు మంత్రి హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version