నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

-

నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగనుంది… లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరణ తెలిపింది.

దీంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఎమ్మెల్సీ కవిత.. ప్రస్తుతం జ్యుడీషీయల్ రిమాండ్లో తీహార్ జైల్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. కాగా, ఇటీవల కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 26 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news