రూపాయి ఖర్చు లేకుండా గుండె ఆపరేషన్.. ఎలాంటి కార్డు అక్కర్లేదు

-

గుండె ఆపరేషన్‌ చేయాలంటే.. లక్షలతో కూడుకున్న పని. చాలా మంది అంత డబ్బులు లేక అప్పులు చేస్తారు, కొందరికి అప్పుకూడ దొరకక అయిన వాళ్లను దూరం చేసుకుంటున్నారు. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా గుండె ఆపరేషన్స్‌ చేస్తే.. ఎలాంటి కార్డులు అవసరం లేదు. సమస్య ఉంటే చాలు..సమాధానం వాళ్లు ఇస్తారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ తరహాలో చికిత్స అందిస్తున్నారు వరంగల్మెడికల్ కాలేజీ వైద్యులు. ఎంతటి గుండె వ్యాధికైనా రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తున్నారు.

సుమారు 150 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్లో ఇప్పుడు గుండెకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేస్తున్నారు. ప్రస్తుతం వందల సంఖ్యలో రోగులు వచ్చి చికిత్స పొందుతున్నారు. నెలకు సుమారుగా 1000కి పైగా ఏంజియోగ్రామ్ పరీక్షలు అందిస్తున్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే కార్పొరేట్ ఆసుపత్రిలో సుమారు మూడు నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. కానీ ఇక్కడ ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇటీవల కొంతమందికి ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన పథకం కింద కేంద్రం ఈ ఆసుపత్రిని మంజూరు చేసింది. ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల ఇక్కడ సిబ్బంది చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారని.. అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని అంటున్నారు.

ఎలాంటి హెల్త్ కార్డ్స్ లేకున్నా ప్రభుత్వ ఆసుపత్రి మాదిరిగా ఎలాంటి రుసుము లేకుండా వైద్యం అందిస్తున్నారు. ఇంకా కొన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మమతారెడ్డి అన్నారు. 2021 డిసెంబర్లో గుండెకు సంబంధించిన చికిత్స మొదలుపెట్టారు. జనవరి నెల నుండి రెగ్యులర్‌గా చికిత్సలు అందిస్తుండగా..నేటి వరకూ 1000 మందికి చికిత్స అందించారు. అందులో 400 మందికి స్టంట్‌లు వేశారు. వైద్యం చేయించుకున్న వారు అందరూ సురక్షంగా ఉన్నారని ఇక్కడి అధికారులు తెలిపారు. ఈ సమాచారాన్ని అవసరం ఉన్నవాళ్లకు తప్పక షేర్‌ చేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news