తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ హెచ్చరికలు ఇలా ఉన్నాయి.
నిన్నటి అల్పపీడనం ఈ రోజు ఒరిస్సా తీరము & పరిసర ప్రాంతంలో అల్పపీడనంగా కొనసాగుతూఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉంది.
నిన్న 19°N వెంబడి ఉన్న ఉపరితల ఆవర్తనం మరియు ఈస్ట్‌వెస్ట్ షీర్ జోన్ ఈ రోజు బలహీన పడింది
దీంతో రాగల 3 రోజులకు వాతావరణ సూచన ఇలా నమోదు కానుంది. ఈరోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.అలాగే ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.