తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల ఈదురు గాలులతో మోస్తారు వర్షాలు పడుతున్నాయి.
మరో రెండు రోజులపాటు హైదరాబాద్, ADB, MBNR, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్ లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మిగతా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణకు మరో 3 రోజులు పాటు వర్షాలు ఉంటాయని ప్రకటించింది వాతావరణ శాఖ.