రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరపిలేకుండా కరుస్తున్న వర్షంతో రంగారెడ్డి జిల్లా నందిగామలో అత్యధికంగా 18.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 17.9 సెం.మీ., రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 15.5 సెం.మీ., రంగారెడ్డిలోని కోతూర్‌లో 14.3 సెం.మీ., ఫరూక్‌నగర్‌లో 14.3 సెం.మీ., వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో 13.9 సెం.మీ., సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 13.8 సెం.మీ., సిద్దిపేట జిల్లా వర్గల్‌లో 13.4 సెం.మీ., వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో 13.3 సెం.మీ. వర్షపాతం నమోదయినట్లు అధికారులు ప్రకటించారు.
ఇక హైదరాబాద్ మహా నగరంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన వాన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. హయత్‌నగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, హిమాయత్‌సాగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, బాలానగర్, దుండిగల్, కొంపల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, గండిపేట్, శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా కురుస్తున్నది.