తెలంగాణలోని ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు నేడు భారీగా వర్షాలు ఉన్నాయి. ఇప్పటికే పలు జిల్లాలలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సూర్యపేట, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నాయి.
సుమారు గంటకు 40 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలియజేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెబుతున్నారు. రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు.