తెలంగాణలో భారీ వర్షాలు..16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

-

తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం లో మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Heavy rains in Telangana Yellow alert issued for 16 districts
Heavy rains in Telangana Yellow alert issued for 16 districts

అయితే… బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, KNR, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ తదితర జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అప్రమత్తంగా ప్రజలు ఉండాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news