టీఎస్ ఆర్టీసీలో భారీగా బ‌దిలీలు.. ఎండీ స‌జ్జనార్ ఉత్త‌ర్వులు జారీ

-

తెలంగాణ ఆర్టీసీలో ఎండీ సజ్జ‌నార్ ప‌రిపాల‌నా సంస్క‌ర‌ణ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రోజుల క్రితం టీఎస్ ఆర్టీసీలో పలువురు ఈడీల‌ను, ఆర్ఎం ల‌ను ఎండీ స‌జ్జ‌నార్ బ‌దిలీ చేశారు. తాజా గా భారీ సంఖ్య‌ల‌లో బ‌దిలీలు చేప‌ట్టారు. బ‌దిలీల‌కు సంబంధించిన ఉత్వ‌ర్వుల‌ను టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జ‌నార్ గురువారం రాత్రి జారీ చేశారు. ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది డివిజ‌న‌ల్ మేనేజ‌ర్లు, 70 మంది డిపో మేనేజ‌న‌ర్ల‌ను బ‌దిలీ చేశారు.

కాగ బ‌దిలీల‌కు సంబంధించిన ఉత్త‌ర్వులు కూడా గురువారం రాత్రే టీఎస్ ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ విడుద‌ల‌ చేశారు. తెలంగాణ ఆర్టీసీలో ఇంత పెద్ద మొత్తంలో ఒకే సారి బ‌దిలీ కావ‌డం ఇదే తొలి సారి. గ‌తంలో బ‌దిలీలు జ‌రిగినా.. చిన్న సంఖ్య‌లో మాత్ర‌మే జ‌రిగేవి కాగ ఇంత పెద్ద మొత్తంలో బదిలీలు జ‌ర‌గలేదు. అయితే టీఎస్ ఆర్టీసీలో మ‌రిన్నీ బ‌దిలీలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. టీఎస్ ఆర్టీసీలో సూప‌ర్ వైజ‌ర్ స్టాయి అధికారుల నుంచి కూడా బ‌దిలీ చేస్తార‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news