సజ్జనార్ కాళ్ళ మీద పడ్డ అవంతి.. ఆ హామీ ఇచ్చిన సజ్జనార్ !

-

రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హేమంత్‌ కుమార్‌ హత్య కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. త‌మ కూతురు అవంతి కులాంత‌ర వివాహం చేసుకుంద‌నే నేపంతో ఆమె కుటుంబ స‌భ్యులు హేమంత్‌ను దారుణంగా హ‌త్య చేయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ హత్యను గచ్చిబౌలి పోలీసులు పరువు హత్యగా నిర్ధారించారు. తన భర్త హేమంత్‌ కుమార్‌ హత్యకు.. తన తండ్రి, మేనమామ కారణమని, వారిని ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని అవంతి డిమాండ్ చేసిన విషయం విధిత‌మే.

ఈ క్రమంలోనే హేమంత్ కుమార్ కుంటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని అతడి భార్య అవంతి.. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిశారు. సీపీ సజ్జనార్‌ని కలిసిన అవంతి.. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని వినతి పత్రం అందించారు. హేమంత్‌ హత్యతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్‌ చేయాలని అవంతి సీపీని కోరారు. ఈ సంధర్భంగా సజ్జనార్ పాదాలకు నమస్కారం చేసిన అవంతికి హత్యతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలి పెట్టమని హామీ ఇచ్చారు సీపీ సజ్జనార్.

Read more RELATED
Recommended to you

Latest news