బాబ్రీ తీర్పుపై స్పందించిన అద్వానీ

-

బాబ్రీ మ‌సీదు కేసులో సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మ‌న‌స్ఫూర్తిగా స్వాగ‌తిస్తున్నాన‌ని బీజేపీ అగ్ర‌నేత ఎల్‌కే అధ్వానీ స్ప‌ష్టం చేశారు. ఈ తీర్పు రామ‌జ‌న్మభూమి ఉద్య‌మంపై త‌న నిబ‌ద్ద‌త‌తోపాటు బీజేపీ చిత్త‌శుద్ధిని తెలియ‌జేస్తుంద‌ని అద్వానీ పేర్కొన్నారు. ఈ కేసులో అద్వానీ నిర్దోషిగా ప్ర‌క‌టించ ‌బ‌డ‌టంతో ఆయ‌న నివాసానికి ప‌లువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయ‌కులు వెళ్లారు.

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన బాబ్రీ మ‌సీదు కేసులో నిందితుల‌పై మోపిన‌ అభియోగాల‌ను ల‌క్నోలోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో బీజేపీ అగ్ర‌నేత ఎల్‌కే అద్వానీ స‌హా 32 మందిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. బాబ్రీమసీదు కూల్చివేత ఘటన ముందుస్తు పథకం ప్రకారం జరిగింది కాదని, పథకం ప్రకారం కూల్చివేసినట్టుగా ఆధారాలు లేవని పేర్కొంది. బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసు తీర్పు నేప‌థ్యంలో ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పోలీసులు భారీగా మోహ‌రించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news