సింగరేణి కార్మికులకు అలర్ట్. సింగరేణి ఎన్నికలపై కీలక ప్రకటన వచ్చింది. సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇవాళ సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హై కోర్టు విచారణ చేసింది.
ఈ నెల 27 న ఎన్నికలు జరిపేందుకు ఈ సందర్భంగా వీలు కల్పించింది తెలంగాణ రాష్ట్ర ఉన్నతా న్యాయస్థానం. ఎన్నికలు వాయిదా వేయాలని వేసిన పిటిషన్ కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు.