కోల్ కత్తా వైద్యురాలు హత్యకేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

-

కోల్ కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పై బెంగాల్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి బదిలీ చేసింది. కోల్ కతా అర్జికల్ మెడికల్ కళాశాలలో చెస్ట్ మెడిసిన్ లో పీజీ చేస్తున్న 31 ఏళ్ల వైద్యురాలు పై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ ఆమె పై ఒడిగట్టినట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ ఆధీనంలోని కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ పై కోర్టు ఈ రోజు తీవ్రస్థాయిలో మండిపడింది. అతను యాక్టివ్ గా లేకపోవడం నిరుత్సాహపరుస్తోందని కోర్టు పేర్కొంది. ఈ ఘటన తర్వాత ప్రిన్సిపాల్ రాజీనామా చేసిన తర్వాత మరో కాలేజీలో ఇదే పోస్టును అప్పగించడంపై కోర్టు ధ్వజమెత్తింది. అతడిని వెంటనే విధుల నుంచి తప్పించి సెలవు పై పంపాలని కోర్టు ఆదేశించింది. ఘోష్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా నియమితులైనందుకు ప్రభుత్వాన్ని నిలదీసింది. “ప్రస్తుతం ఉన్న కేసు ఒక విచిత్రమైన కేసు. ఇకపై సమయం వృధా చేయకూడదు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండవచ్చు” అని కోర్టు పేర్కొంది. ఘటన జరిగి 5 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు ముఖ్యమైన నిర్ధారణలు లేవని.. అందువల్ల సాక్ష్యాలు ధ్వంసం చేసే అన్ని అవకాశాలు ఉన్నాయని కోర్టు వెల్లడించింది. తక్షణమే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడం సముచితమని కోర్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news