వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసుల విచారణస్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఇక కాకాణి క్వాష్ పిటిషన్ పై తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. తెల్ల రాయి అక్రమ రవాణా సహకరిస్తున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి పై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకి కోసం పోలీసుల తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. మూడు బృందాలతో గాలింపు చేపట్టారు పోలీసులు. కాకాణి సమీప బంధువుల నుంచి సమాచారం సేకరించే పనిలో పడిపోయారు. హైదరాబాద్, నెల్లూరు సహా మరికొన్ని ప్రాంతాల్లో కాకాణి ఆచూకి కోసం ఆరా తీస్తున్నారట నెల్లూరు పోలీసులు. మరోవైపు మాజీ మంత్రి కాకాణి కేసులో మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు పోలీసులు.