హైకోర్టు సంచ‌ల‌న తీర్పు.. గురుకుల‌ టీజీటీ పోస్టుల‌కు బీటెక్ అభ్య‌ర్థ‌లు అర్హులే

-

గురుకుల టీజీటీ పోస్టుల విష‌యంలో రాష్ట్ర హై కోర్టు సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. గురుకుల టీజీటీ పోస్టుల‌కు బీటెక్ విద్యార్థులు అర్హులే అని హై కోర్టు సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. గ‌త కొద్ది రోజులు గా గురుకుల టీజీటీ పోస్టుల భ‌ర్తీ లో బీటెక్ అభ్య‌ర్థుల అర్హత పై వివాదం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. తాజా గా దీని పై హై కోర్టు సంచ‌ల‌న తీర్పు ను ఇచ్చింది. బీఈడీ చేసిన బీటెక్ అభ్య‌ర్థుల‌ను గురుకుల టీజీటీ పోస్టుల‌కు అర్హులే అని తెల్చి చెప్పింది.

అలాగే గురుకుల విద్యాసంస్థల నియామ‌క బోర్డు అప్పిళ్ల‌ను అన్నింటినీ హై కోర్టు కొట్టివేసింది. బీఈడీ చేసిన బీటెక్ అభ‌ర్థుల‌ను త‌ప్ప‌కుండా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా నాలుగు వారాల్లో నియామ‌కాలు చేప‌ట్టాల‌ని కూడా హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగ హై కోర్టు తీర్పు తో బీఈడీ చేసిన బీటెక్ అభ్య‌ర్థులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news