చంచల్‌గూడా జైలుకు రెరా డైరెక్టర్‌ శివబాలకృష్ణ

-

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెరా డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ ముమ్మరంగా విచారణ జరుపుతోంది. ఈ కేసులో నిందితుడైన శివబాలకృష్ణను అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ముందు హాజరు పరచగా నాంపల్లి కోర్టు అతడికి14 రోజుల జ్యూడిషల్‌ రిమాండ్ విధించింది.

ఈనెల 24వ తేదీన శివబాలకృష్ణ సహా అతడి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు దాదాపు కోటి రూపాయల నగదు, భారీగా ఆస్తిపత్రాలు, దస్తావేజులు, రెండు కిలో బంగారు ఆభరాణాలు, ఆరు కిలోల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. స్వాధీనం చేసుకున్న స్థిర,చర ఆస్తుల విలువే ఆరు కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు. చంచల్ గూడా జైల్లో ఉన్న శివబాలకృష్ణను కస్టడీలో తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. బినామీలను విచారించడంపైనా వారు దృష్టి పెట్టారు. ఏళ్ల తరబడి హెచ్ఎండీఏలో పనిచేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు తన బ్యాంకు లాకర్లపై అధికారులు దృష్టి పెట్టినప్పటికీ ఎలాంటి బ్యాంక్ లాకర్లు లేనట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version