తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తుంది. దీంతో ఇటీవల ముఖ్య మంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8వ తేది నుంచి 16 వరకు రాష్ట్రంలో ఉన్న ప్రయివేటు, ప్రభుత్వ అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే సెలవుల నుంచి మెడికల్ కాలేజీలకు మినహాయింపు ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో తాజా గా విద్యాశాఖ అధికారులు సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగూణంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తు ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ ఉత్తర్వల ప్రకారం ఈ నెల 8 నుంచి 16 వరకు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు మినహా అన్ని ప్రయివేటు, ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలువులు రానున్నాయి. అయితే ఈ సెలవు దినాలలో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్ వినేందుకు వెసులు బాటు కల్పించారు. అయితే సంక్రాతి సందర్భంగా ఈ నెల 11 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ముందుగా భావించింది. అయితే రాష్ట్రంలో కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.