మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ ప్రభుత్వం మరో పథకానికి తాజాగా శ్రీకారం చుట్టింది. భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఇళ్ల నమూనాను ఆవిష్కరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని అభివర్ణించారు. పేదల కష్టాలు చూసిన ఇందిరాగాంధీ అప్పట్లో ఈ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.

ఇప్పుడు ప్రజా పాలనలో కూడా పేదలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇంటి నిర్వహణ మహిళా చేతిలో ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశారని ఆరోపించారు. పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని మండి పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news