ఎన్నికల వేళ భారీగా నగదు పట్టివేత.. రూ.10 లక్షల్లోపు ఉంటే 48 గంటల్లో డబ్బు వాపస్‌

-

ఎన్నికల కోడ్ పేరిట పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు చూపించకుండా రూ.50 వేలకుపైగా నగదు, 10 గ్రాములకుపైగా బంగారం కనిపిస్తే చాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం స్పందిస్తూ  బాధితులు సొమ్మును తిరిగి పొందేందుకు ప్రతి జిల్లాలో గ్రీవెన్స్‌సెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెల్‌ ఛైర్మన్‌ను సంప్రదించి.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన సొత్తు వివరాలను సమర్పిస్తే 48 గంటల్లో తిరిగిచ్చేస్తారని ఎన్నికల అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.10 లక్షలలోపు మాత్రమే ఉండాలని.. అంతకు మించితే ఆదాయ పన్నుశాఖ అధికారులకు వివరాలు వెల్లడించాలని సూచించారు.

మీ సొత్తు ఎలా తిరిగి తీసుకోవాలంటే.. 

  • సొత్తు తిరిగి పొందాలనుకునేవారు పోలీసు కేసు వివరాల పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో చూపిస్తే.. అక్కడి అధికారులు దానిని గ్రీవెన్స్‌సెల్‌కు పంపిస్తారు.
  • కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌సెల్‌ ఛైర్మన్‌ను కలిస్తే కేసు వివరాలు, ఆధారాలు స్వీకరించి.. దీనికి సంబంధించి ఓ రసీదు ఇచ్చి తమ సెల్‌ అధికారులు ఫోన్‌ చేసినప్పుడు రావాలని చెబుతారు.
  • 48 గంటల్లోపు బాధితులను పిలిపించి వారు సమర్పించిన ఆధారాలను క్షుణ్నంగా పరిశీలించి.. అన్నీ సరిగా ఉంటే రిటర్నింగ్‌ అధికారికి తెలియజేస్తారు.
  • రిటర్నింగ్‌ అధికారి సొత్తు తిరిగిచ్చేయాలని వాటిని నిల్వ చేసిన ఠాణాకు ఆదేశాలు జారీ సిన తర్వాత బాధితులు ఠాణాకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version