తెలంగాణకు విదేశీ పెట్టుబడుల వెల్లువ.. తొలి త్రైమాసికంలో నాలుగో స్థానంలో రాష్ట్రం

-

తెలంగాణకు ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐలు) ప్రవాహం గణనీయంగా పెరిగిందని కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన డేటా వెల్లడించింది.  ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్యకాలంలో దేశంలోకి మొత్తం రూ.1,66,294 కోట్ల ఎఫ్‌డీఐలు రాగా.. ఈ ఆరు నెలల కాలంలో తెలంగాణకు రూ.8,655 కోట్లు రాగా, ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.744 కోట్లు దక్కినట్లు ఈ డేటా తెలిపింది. తెలంగాణకు ఏపీ కంటే పది రెట్లు ఎక్కువగా వచ్చాయి.

2023-24 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) పెట్టుబడులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. 2023 క్యాలెండర్‌ ఇయర్‌ తొలి ఆరునెలల్లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ 6వ స్థానంలో నిలువగా, ఆంధ్రప్రదేశ్‌ 12వ స్థానానికి పరిమితమైంది. మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక తొలి మూడు స్థానాలను ఆక్రమించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version