తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త..ఇవాళ హాలిడే !

-

 

తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త అందించింది. ఇవాళ ప్రభుత్వ సెలవుగా ప్రకటన చేసింది. పలు రాష్ట్రాలలో రాఖీ పండుగను నిన్న చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఇవాళ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లు అలాగే కాలేజీలకు ఇవాళ పబ్లిక్ హాలిడే ఉంది.

శ్రావణ పౌర్ణమి మరియు రాఖీ పౌర్ణమి సందర్భంగా సెలవు ఇస్తున్నట్లు ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో విద్యార్థులకు ఇవాళ హాలిడే వచ్చింది. ఇది ఇలా ఉండగా ఏపీ విద్యార్థులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది జగన్‌ సర్కార్‌. నేడు ఏపీ సెలవు లేదు. ఈ రోజు రాఖీ పండుగ అయినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పబ్లిక్ హాలిడే లేదు. డిసెంబర్ 12న ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితాలో రక్షాబంధన్ లేదు. ఆప్షనల్ హాలిడే కూడా ప్రకటించలేదు. దీంతో స్కూల్లు, కాలేజీలు యధావిధిగా కొనసాగనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version