విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలు సహా పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల డైట్ చార్జీలను పెంపునకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. పెరిగిన డైట్’ చార్జీలు జులై నెలనుండి అమలులోకి రానున్నాయి.
పెరిగిన డైట్’ చార్జీల వివరాలు… 3 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న రూ. 950 ల డైట్ చార్జీలు రూ. 1200 కు పెరిగాయి. 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న డైట్’ చార్జీలు రూ.1100 నుంచి రూ.1400 లకు పెరిగాయి. 11 వ తరగతి నుండి పీ.జీ దాకా చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న డైట్ చార్జీలు రూ.1500 నుంచి రూ.1875 లకు పెరిగాయి.