మహాలక్ష్మి స్కీమ్ ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సుల్లో ఒకేరోజు 51.74 లక్షల మంది ప్రయాణం

-

తెలంగాణలో కొత్త సర్కార్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లో నిల్చోవడానికి కూడా సందు దొరకడం లేదంటే ఈ స్కీమ్కు దక్కుతున్న ఆదరణ అర్థం చేసుకోవచ్చు.

ఈ పథకం ప్రారంభమైన తర్వాత సోమవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రయాణం జరిగింది. కేవలం ఆ ఒక్క రోజే ఏకంగా 51.74 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. పాసులు ఉన్న వారిని మినహాయిస్తే 48.5 లక్షల మందికి ఆర్టీసీ టికెట్‌ జారీ చేయగా.. వీరిలో 30.16 లక్షల మంది మహిళలు. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు మొత్తం ప్రయాణికుల్లో సుమారు 40 శాతం మహిళలు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 60 శాతానికి చేరిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉచిత ప్రయాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రీయింబర్స్‌మెంట్‌తో కలిపితే ఒక్కరోజులోనే రూ.21.10 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news