Hyderabad: స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం..

-

Hyderabad : స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శంషాబాద్ మున్సిపాలిటీలోని స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ గోదాం పక్కనే సిలిండర్ గోదాం ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Hyderabad A huge fire broke out in a scrap warehouse

మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జనావాసాల మద్య జరగడంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. పక్కనే గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన గ్యాస్ గోదాం ఉండడంతో మరింత భయపడుతున్నారు స్థానికులు. స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news