ఎంఐఎం పార్టీ మెప్పుకోసమే హైదరాబాద్ సీపీని మార్చారు – ఎంపీ రఘునందన్

-

వినాయక చవితి రోజు తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. కీలక స్థానాలలో ఉన్న అధికారులను బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ పైన ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో హైదరాబాద్ సీపీగా పని చేసిన సీవీ ఆనంద్ ని తిరిగి రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమించుకుంది.

ఇప్పుడు ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఈ బదిలీలపై బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీవో భవన్ లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఎంఐఎం పార్టీ మెప్పు కోసమే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ని మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గణేష్ ఉత్సవాల సమయంలో సిటీ పోలీస్ కమిషనర్ ని మార్చడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు రఘునందన్ రావు. కాగా కొంతకాలంగా హైదరాబాద్ లో శాంతి భద్రతల పైన రాజకీయంగా విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version