హైదరాబాద్ నగరం ఇప్పుడు దేశంలోనే అత్యంత సేఫ్ సిటీ అని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. శనివారం హైదరాబాద్ హైటెక్ సిటీలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ లా అండ్ ఆర్డర్ మైంటైన్ చేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ కి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 20 వేల పరిశ్రమలు వచ్చాయని.. తెలంగాణ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. ఎస్ఆర్డిపి కింద హైదరాబాద్ లో 36 ఫ్లై ఓవర్లు నిర్మించామన్నారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అలాగే తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు.