ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ నవనీత రావు (95) తుది శ్వాస విడిచారు. ఆయన మృతి తీరని లోటు అని పలువురు విద్యార్థులు అధ్యాపకులు సంతాపం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. నవనీత రావు 1985 నుంచి 1991 వరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా పనిచేశారు. నవనీతరావు మృతితో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి పలువురు అధ్యాపకులు, విద్యార్థులు చేరుకుంటున్నారు. ఆయన మృతిపై బిఆర్ఎస్ నేత దాసోజ్ శ్రావణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నవనీత రావు డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ అని కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీ గౌరవాన్ని పెంచడమే కాకుండా నిరుపేద విద్యార్థుల జీవితాలను కూడా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. నవనీత మృతి పై దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిపాలనలో రాజకీయ జోక్యాలకు తావు ఇవ్వకుండా.. స్వయం ప్రతిపత్తిని కొనసాగించారని గుర్తు చేశారు. ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఆ తర్వాత ఐపిఈ లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆయనతో సన్నిహితంగా పనిచేయడం తనకు దక్కిందని పేర్కొన్నారు శ్రవణ్. నవనీత రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.