Hyderabad metro to start by 30 mins from July 30: హైదరాబాద్ నగర వాసులకు అదిరిపోయే శుభవార్త అందింది. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు రాకపోకల సమయాన్ని మార్చేశారు. ఇవాల్టి నుంచి.. ఉదయం ఐదున్నర గంటలకే మెట్రో ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు. ఈ మధ్యకాలంలో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.
దీంతో ఆ రద్దీని తగ్గించేందుకు మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం ఐదున్నర గంటలకే మెట్రో ప్రారంభం అయితే చాలామంది ప్రయాణికులకు మేలు జరుగుతుందని భావిస్తోంది. మెట్రో రైలు హైదరాబాద్ నగర వాసులకు ఎక్కువ సమయం అందుబాటులో ఉండేలా టైం టేబుల్ ఫిక్స్ చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. ప్రయాణికుల బాగోగులే తమకు ముఖ్యమని వివరించారు. ప్రయాణికుల నుంచి దీనిపై ఎప్పటినుంచో డిమాండ్ వస్తుందని.. అందుకే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.