హైదరాబాద్ పంజాగుట్ట మెరిడియన్ హోటల్లో దారుణం చోటుచేసుకుంది. బిర్యానీ తినేందుకు వచ్చిన ఓ కస్టమర్‌పై సిబ్బంది దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. ఇదంతా కస్టమర్ ఎక్స్ట్రా పెరుగు అడిగినందుకు జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
హైదరాబాద్ పంజాగుట్ట మెరిడియన్ హోటల్లో ఘర్షణ చోటుచేసుకుంది. అర్ధరాత్రి బిర్యానీ తినేందుకు చాంద్రాయణగుట్టకు చెందిన లియాకత్ మెరిడియన్ హోటల్‌కు వెళ్లాడు. బిర్యానీ తినే క్రమంలో ఎక్స్ట్రా పెరుగు తీసుకురమ్మని సిబ్బందిని అడిగాడు. అలా ఎక్స్ట్రా పెరుగు ఇవ్వడం కుదరదని సిబ్బంది చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది.
హోటల్ సిబ్బంది చేతిలో గాయపడిన లియాకత్ వారిపై ఫిర్యాదు చేసేందుకు పలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ హోటల్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసే క్రమంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే లియాకత్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. లియాకత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.