గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ నెలకొంది. హైడ్రా బాధితుల భయంతోనే.. గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ నెలకొంది. హైడ్రా బాధితులు దాడి చేస్తారేమో అనే అనుమానంతో గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ నెలకొన్నట్లు సమాచారం అందుతోంది. గాంధీభవన్ చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు.. ఎవరినీ లోపలికి రానివ్వడం లేదు.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు వ్యాపార సంస్థలు కోల్పోయిన బాధితులు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. మూసి పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఇళ్ళను హైడ్రా కూల్చుతోంది. కూల్చివేతలను నిరసిస్తూ గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు మూసీ పరివాహక బాధితులు. హైడ్రా బాధితులు దాడి చేస్తారేమో అనే అనుమానంతో గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ నెలకొన్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.