గాంధీభవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకున్నారు పోలీసులు. ఈ తరునంలో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అంతేకాదు.. బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు కొందరు వచ్చారు. వారిని మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు.
అనంతరం వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పోలీస్‌స్టేషన్ కు తరలించారు. రాహుల్ గాంధీకి
మోడీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇక అటు రాహుల్ గాంధీ హత్యకు కుట్రలు చేస్తున్నారని…పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. బిజేపి నేతలపై కాంగ్రెస్ నేత అజయ్ మెకన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ని హతమారుస్తామని, భౌతిక దాడులకు పాల్పడతామంటూ బిజేపి నేతల హెచ్చరికలు జారీ చేశారని.. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ లో బిజేపి నేతలపై ఫిర్యాదు చేశారు.