సూక్ష్మ, చిన్న పరిశ్రమలను పటిష్టం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. MSME లపై మా ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త పాలసీని తీసుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థకు MSME లు చాలా కీలకం అన్నారు.
గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో అధికంగా MSME మూత బడ్డాయి. తెలంగాణలో చాలా తక్కువ మూత పడ్డాయని గుర్తు చేశారు భట్టి విక్రమార్క. భారీ పరిశ్రమలతో పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు కూడా చాలా అవసరం అన్నారు. MSMEలకు ప్రత్యేక పాలసీ అంటూ ఏమి లేదు. రాయితీలు, భూకేటాయింపు మహిళల కోటా పెట్టి MSME పాలసీ తీసుకొచ్చాం. ఆర్థిక వనరులు అందరికీ సమానంగా వచ్చేటట్టు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ కూడా వచ్చింది. పరిశ్రమలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.