పత్తి రైతులు సమస్యలతో కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ..!

-

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాసారు. ప్రస్తుత సంవత్సరం రాష్ట్రంలో 9.95 లక్షల ఎకరాలలో పత్తి సాగుచేయగా 60.00 లక్షల క్వింటాలు దిగుబడి అంచనా ఉందని పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం 2024-2025 కు ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు 7521. రాష్ట్ర వ్యాప్తంగా 60 జిన్నింగ్ మిల్లులు, 11 మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది వ్యవసాయ మార్కెటింగ్ శాఖ.

11.11.2024 నుండి పత్తి కొనుగోలు ప్రారంభించిన CCI.. పత్తి నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని రైతుల వద్ద కొనుగోలు చేయటానికి తిరస్కరించింది. రైతులు తమ పత్తిని CCI వారికి అమ్ముకోవటంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాబట్టి పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు అచ్చెన్నాయుడు. సెప్టెంబర్, అక్టోబర్ లో తుఫానులు వంటి ప్రకృతి వైపరిత్యాలు.. ఏపీ లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పత్తి రైతులకు సంభవించిన నష్టాన్ని నివారించాలి. CCI వారు నిర్ణయించిన నాణ్యత ప్రమాణాలు ముఖ్యముగా తేమ శాతాన్ని 12% నుండి 18% పెంచాలి. వర్షాల వల్ల రంగు మారిన పత్తిని కూడా CCI వారు తిరస్కరించకుండా రైతుల వద్ద మొత్తం పత్తిని కొనుగోలు చేయాలి. నిర్ణయించిన నాణ్యత ప్రమాణాలు సడలించాలి అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version