హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. ఇవాళ ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

-

 

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లోని గోల్కొండ పరిసరాల్లో వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ను పోలీసులు రిలీజ్ చేశారు.

ఇవాళస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గోల్కొండకోట ప్రాంతంలో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు పోలీసులు. అయితే, ఈ వేడుకలకు వచ్చే వారి కోసం పోలీసులు ప్రత్యేక రూట్ మ్యాప్ ఇచ్చారు.

గోల్కొండ కోటలో ఇండిపెండెంట్ సెలబ్రేషన్ కోసం రాణిమహల్‌ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకు ఉన్న రోడ్డును పోలీసులు క్లోజ్ చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ఏ గోల్డ్, ఏ పింక్, బీ నీలం పాసులను ఇప్పటికే ఇచ్చేశారు. ఆ పాసులు ఉన్న.. వెహికిల్స్ కు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం వైపు నుంచి గోల్డ్, ఏ పింక్, ఏ నీలం పాసులు ఉన్న వారిని గోల్కొండ కోటలోకి పర్మిషన్ ఇస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news