హైడ్రా అధికారులతో కలిసి ఈరోజు బెంగళూరు వెళ్లిన కమిషనర్ రంగనాథ్ అక్కడ కర్ణాటక నాచురల్ డిజాస్టర్ మానిటరింగ్ ఏజెన్సీని విజిట్ చేసారు. అయితే వారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విపత్తుని ముందుగానే గుర్తించి సూచిస్తున్నారు. వారి సూచనలు రియాల్టీకి చాలా దగ్గరగా ఉన్నాయి. అడ్వాన్స్డ్ సెన్సార్స్ టెక్నాలజీతో వాతావరణ సూచికలను కూడా గుర్తిస్తున్నారు. హైదరాబాద్ వెళ్ళిన వెంటనే ఈ తరహా టెక్నాలజీ పై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ప్రభుత్వంతో సంప్రదించి ముందుకు వెళ్లే దిశగా ప్రయత్నం చేస్తాం అని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు.
అయితే ఇక్కడికి రావడానికి కారణం డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్ పరిశీలించడం మాత్రమే కాదు. చెరువుల సుందరీకరణ పరిశీలించడమే ప్రధాన కారణం. BBMP ఆధ్వర్యంలో బిమొస్ అనే సంస్థ చాలా భాగా చెరువులు పునరుద్ధరించారు. ఇక్కడ ఉన్న 200 చెరువుల్లో 130 చెరువులు చాలా అద్భుతంగా పునరుద్ధరించారు. స్థానిక ప్రజల సహకారంతో.. వారిని భాగస్వాములను చేస్తూ చెరువులు పునరుద్ధరించారు. నీళ్ళ నుండి పొల్యూషన్ వేరు చేసే పద్దతులను కూడా చూశాం. ఈ మధ్య కొన్ని చెరువుల్లో కూల్చివేతలు చేపట్టి ఆక్రమణలు తొలగించామో.. అలాంటి చెరువుల వద్ద రుదరణ చేపట్టాలని ప్రభుత్వం నుంచి కూడా నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఆ చెరువుల పునరుద్ధరణ చేయబడతాము. అయితే ఈ కూల్చివేతలు ఎవరిని ఉద్దేశించి కావాలని చేపట్టినవి కావు అని రంగనాథ్ పేర్కొన్నారు.