హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు ఆగటం లేదు. వీకెండ్ వస్తే హైడ్రా అధికారుకు ఎక్కడికి వస్తారో అని ఆక్రమణ దారులు భయపడుతున్నారు. అయితే తాజాగా GHMC అధికారులతో కలిసి ఫిల్మ్ నగర్ కి ఆక్రమణలను తొలగించింది హైడ్రా. ఫిల్మ్ నగర్ లో రోడ్డు ఆక్రమించి నిర్మించిన కట్టడం పై స్థానికుల ఫిర్యాదు తో ఫిల్మ్ నగర్ లేఅవుట్ ను పరిశీలించారు హైడ్రా అధికారులు. అయితే రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్టు నిర్ధారణకు వచ్చిన అధికారులు.. అదే స్థలానికి అనుకుని ఉన్న ఇళ్ల ప్రహరీ కూడా రోడ్డును ఆక్రమించి నిర్మించినట్టు నిర్ధారించారు.
దాంతో అక్కడ రేకుల షెడ్డుతో పాటు ఆ పక్కనే ఉన్న ఇంటి ప్రహరీని కూల్చి వేశారు అధికారులు. కూల్చివేతలు జరిగిన వెంటనే డెబ్రీస్ ను తొలగించారు హైడ్రా అధికారులు. అయితే GHMC ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తో మాట్లాడారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. తమ అధికారులు తొలగించిన స్థలంలో వెంటనే రోడ్డు నిర్మించాలని జోనల్ కమిషనర్ కు సూచించారు హైడ్రా కమిషనర్.